మధు కా పాంచ్వా బచ్చా.. ఆధార్ గందరగోళం
బుద్వాన్: ఆధార్ కార్డుపై పేరు సరిగా లేని కారణంగా ఓ బాలికకు స్కూల్ అడ్మిషన్ దక్కలేదు. ఈ ఘటన యూపీలోని బుద్వాన్‌లో జరిగింది. స్కూల్లో అమ్మాయిని అడ్మిట్ చేసేందుకు తీసుకువెళ్లగా.. ప్రభుత్వ స్కూల్ అధికారులు ఆధార్ కార్డు కావాలని అడిగారు. అయితే ఆ అమ్మాయి ఆధారు కార్డుపై మధు కా పాంచ్వా బచ్చా అని రాసి ఉన్నట్లు స్కూల్ యాజమాన్యం గుర్తించింది. ఇంగ్లీష్‌లో బేబీ ఫైవ్ ఆఫ్ మధు అని కార్డుపై రాసి ఉంది. ఆ కార్డుకు ఎటువంటి ఆధార్ నెంబర్ కూడా లేదు. బిల్సీ తహిశీల్‌లోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన దినేశ్ తన కూతురు ఆర్తిని స్కూల్‌కు చేర్పించేందుకు ప్రైమరీ పాఠశాలకు వెళ్లాడు. ఆధార్ కార్డు చూపిస్తేనే స్కూల్లో అడ్మిషన్ ఇస్తామని ఓ టీచర్ దినేశ్‌ను వెనక్కి పంపింది. ఆ సమయంలో నెంబర్, పేరు లేని ఆధారు కార్డు గుట్టు బయటకు వచ్చింది. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఆధార్ కార్డులను తయారు చేస్తున్నారని, తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బ్యాంక్ పోస్టాఫీసు అధికారులకు అలర్ట్ చేస్తామని జిల్లా మెజిస్ట్రేట్ దీపా రంజన్ తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆ ఆధార్ కార్డు వైరల్ అవుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

