Dimple Hayathi | కారును ఢీకొట్టి.. ఆపై వీరంగం.. నటి డింపుల్ హయతీపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో క్రిమినల్ కేసు
ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్‌తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Dimple Hayathi | ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్‌తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్కేఆర్ ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్ అధికారి నగర ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు.

అదే అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ సీ (2)లో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. భవనానికి చెందిన పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన డీసీపీకి చెందిన అధికారిక వాహనానికి అడ్డుగా డింపుల్ హయతీ, విక్టర్ డేవిడ్‌లు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతోపాటు అకారణంగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎం.చేతన్ కుమార్‌తో వాగ్వాదానికి దిగుతుంటారు. తమ కారును తీసేందుకు వీలుగా కారు పార్క్ చేసుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా పలుమార్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు.

Dimple
ఈ క్రమంలో ఈనెల 14న రాత్రి పార్క్ చేసిన డీసీపీ అధికారిక వాహనంను డింపుల్ హయతీ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కారుకు ఇతర వాహనాలు తగలకుండా జాగ్రత్త కోసం పెట్టిన కోన్స్‌ను, డీసీపీ కారును కాలితో తన్నుతూ వీరంగం సృష్టించింది.ఇదేంటని ప్రశ్నించిన కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించింది. దీంతో కానిస్టేబుల్ చేతన్ కుమార్ మూడురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డింపుల్ హయతీతోపాటు ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం హీరోయిన్ డింపుల్ హయతీ, విక్టర్ డేవిడ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఆర్పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చి పంపించారు.
Dimple Hayathi | ఖతర్నాక్ పోజులతో కైపెక్కిస్తున్న డింపుల్ హయతి..
మరిన్ని ఫొటోలకు: Dimple Hayathi | ఖతర్నాక్ పోజులతో కైపెక్కిస్తున్న డింపుల్ హయతి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

