Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన చారిత్రాత్మక దీక్షా దివస్ ను పురస్కరించుకొని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆస్ట్రేలియా : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన చారిత్రాత్మక దీక్షా దివస్( Deeksha Divas ) ను పురస్కరించుకొని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ( BRS Australia ) అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి (Kasarla Nagender Reddy) ఆధ్వర్యంలో రక్తదాన ( Blood Donation ) కార్యక్రమాలు నిర్వహించారు.

మెల్బోర్న్, సిడ్నీ, అడిలైడ్, కాన్బెర్రా, బ్రిస్బేన్, పెర్త్ నగరాల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిడ్నీలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 చిరస్మరణీయమైన రోజని, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నారు.
కేసీఆర్ పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ విదేశీ గడ్డపై రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ రాంపల్లి, శ్రీనివాస్ సుతారి, మధుకర్ సుతారి, నిఖిలేష్ బొండు గుల, అబ్రార్ మహమ్మద్, అభిలాష్ రెడ్డి కుప్పిరెడ్డి, రాజ్‌కుమార్ నార్మేటి, వెంకట్ సాయి గుప్తా, జస్వంత్ కొడెరపు, లక్ష్మణ్ నల్లన్, రణధీర్ గిరి, ప్రమోద్ గాలి, ఆదిత్య నల్లన్ పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

