Jennifer Gates | తాత కాబోతున్న బిల్‌గేట్స్.. వైరల్ అవుతున్న కూతురు జెన్నిఫర్ బేబీ బంప్ ఫొటోలు
నయెల్ నాజర్, జెన్నిఫర్ గేట్స్‌ల వివాహం పోయిన ఏడాది అక్టోబర్‌లో జరిగింది
Jennifer Gates : మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ త్వరలోనే తాత కాబోతున్నాడు. అవును.. ఆయన కూతురు జెన్నిఫర్ గేట్స్ త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ న్యూయార్క్‌లోని తమ ఇంటి ఆవరణలో బేబిబంప్‌తో ఉన్న ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది జెన్నిఫర్‌కు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు.
‘చాలా సంతోషంగా ఉంది. చంటిబిడ్డను కలిసేందుకు, మీ ఇద్దరినీ తల్లిదండ్రులుగా చూడబోతున్నందుకు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది’ అని జెన్నిఫర్ తల్లి మెలిండా కామెంట్ చేసింది. ఈజిప్ట్‌కు చెందిన గుర్రపు స్వారీ నిపుణుడు నయెల్ నాజర్, జెన్నిఫర్ గేట్స్‌ల వివాహం పోయిన ఏడాది అక్టోబర్‌లో జరిగింది.
ప్రపంచంలో ధనవంతుడిగా పేరున్న బిల్‌గేట్స్ 2000 సంవత్సరంలో బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించాడు. పేద దేశాల్లోని పిల్లలకు ఈ సంస్థ ద్వారా వైద్యసాయం చేస్తున్నాడు. 2021లో బిల్‌గేట్స్, మెలిండా గేట్స్ విడాకులు తీసుకుని అందరినీ షాక్‌కు గురిచేశారు. దాంతో వీళ్ల 27 ఏళ్ల వివాహ బంధానికి తెరపడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ.. ‘బావర్చి’ కేసులో కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
నల్లగొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

