గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ

హైదరాబాద్: భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆయన్ను సత్కరించింది. ప్రస్తుతం కామెంటేటర్‌గా చేస్తున్న సునీల్‌కు బీసీసీఐ ఇవాళ ప్రత్యేక జ్ఞాపికను అందజేసింది. టీమిండియా తరపున 50 ఏళ్ల క్రితం సరిగ్గా ఈ రోజున సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బీసీసీఐ కార్యదర్శి జే షా ఈ నేపథ్యంలో ఇవాళ మొతేరా స్టేడియంలో గవాస్కర్‌ను సన్మానించారు. ప్రత్యేక బ్లూ కలర్ క్యాప్‌ను గవాస్కర్‌కు అందజేశారు. టెస్ట్ క్రికెట్లో సునీల్ గ్రేటెస్ట్ ఓపెనర్‌గా నిలిచాడు. టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన తొలి క్రికెటర్ గవాస్కరే. మొత్తం 125 టెస్టులు ఆడిన సునీల్.. 10122 రన్స్ చేశాడు. 236 నాటౌట్ అత్యధిక స్కోర్. గవాస్కర్ టెస్ట్ క్రికెట్లో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

