హడలెత్తిస్తున్న పెద్దపులి

- రోళ్లపాడు వైపు వెళ్లినట్లు గుర్తింపు
- సెల్ఫోన్లో వీడియో తీసిన స్థానికులు
- భయంతో వణుకుతున్న ప్రజలు
- అప్రమత్తం చేస్తున్న అటవీశాఖ అధికారులు
టేకులపల్లి, నవంబర్ 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి అటు ప్రజలకు, ఇటు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా హడలెత్తిస్తున్నది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కేవోసీ, కుంటల్ల మీదుగా రోళ్లపాడు వైపు వెళ్లిన పులిని స్థానికులు, ఫారెస్టు అధికారులు ప్రత్యక్షంగా చూశారు. కోయగూడెం ఉపరిత గని, కుంటల్ల పంచాయతీలోని అందుగులగూడెం గ్రామ సమీపాన వరి పొలం గట్టుపై వెళ్తున్న పులిని స్థానికులు సెల్ఫోన్లో వీడియో తీశారు. మండలంలోని కుంటల్ల, అందుగులగూడెం, బద్దుతండా, నర్సాయిగూడెం, బేతంపూడి, తొమ్మిదోమైలుతండా, రోళ్లపాడు, రుక్మాతండా, బిల్యితండా తదితర అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టేకులపల్లి రేంజర్ ముక్తార్ హుస్సేన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో టేకులపల్లి ఎఫ్ఆర్వో ముక్తార్ హుస్సేన్, డిప్యూటీ ఎఫ్ఆర్వో బి.కృష్ణ, ఫారెస్టు అధికారులు మోహన్, భద్రయ్య, సీహెచ్ నర్సయ్య, రామ్మూర్తి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

