వారి వికృత క్రీడకు పోసాని పెయిడ్ ఆర్టిస్ట్ : అచ్చెన్నాయుడు
Atchannaidu responded to Posani comments | జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శక నిర్మాత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ

అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శక నిర్మాత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్, ప్రశాంత్ కిశోర్ వికృత క్రీడకు పెయిడ్ ఆర్టిస్ట్‌గా పోసాని కృష్ణ మురళీ ఉన్నారని విమర్శించారు. పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, పవన్ కుటుంబం గురించి ప్రశాంత్ కిశోర్ మాట్లాడించారని ఆరోపించారు.
పవన్ కుటుంబ సభ్యుల గురించి పోసానితో ప్రశాంత్ కిశోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ ఎందుకు బహిరంగంగా వారించలేదని ప్రశ్నించారు. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే జగన్‌కు ఆనందంలో మునిగితేలుతున్నారని విమర్శించారు. మద్యం షాపుల దగ్గర తాగిన తాగుబోతులు సైతం ఇలా మాట్లాడరేమో? అని అన్నారు.
డ్రగ్స్ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందని మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ధరలు పెంచడం, దోపిడీ పాల్పడటం వంటి వాటితో ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్లో వైఎస్సార్ సీపీ నేతలు కుల, మత, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

