America Evacuation : ఆఫ్ఘాన్ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా
America Evacuation : తమ పౌరుల రక్షణ గురించి జో బైడెన్ ప్రభుత్వం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నది. వారిని ఉన్నఫలంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను సిద్ధం చేసింది. అయితే, ...

కాబూల్ / వాషింగ్టన్ : (America Evacuation) ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు విషమంగా మారుతుండటంతో వివిధ దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. శాంతి పరిరక్షణకు ఒకపైపు చర్చలు ప్రారంభం కాగా, మరోవైపు ఆ దేశం నుంచి తమ పౌరులను తరలించే ఏర్పాట్లలో వివిధ దేశాలు ఉన్నాయి. ఇప్పటికే భారతదేశం అక్కడి నుంచి 50 మందిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించింది. ఇదే బాటలో అమెరికా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం 3 వేల మంది సైనికులను అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పంపింది. మరో నెల రోజుల్లో తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉండటంతో.. తమ పౌరుల రక్షణ గురించి జో బైడెన్ ప్రభుత్వం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నది. వారిని ఉన్నఫలంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను సిద్ధం చేసింది. అయితే, ఎక్కువ కాలంపాటు అక్కడ ఉండేందుకు తమ సైనికులను పంపడం లేదని, ఇది తాత్కాలిక మిషన్ మాత్రమేనని అమెరికా స్పష్టం చేసింది. తమ పౌరులకు, ఎంబసీ సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టవద్దని అమెరికా తాలిబాన్లకు విజ్ఞప్తిచేసింది.
ఇదే సమయంలో కువైట్‌లోని అమెరికన్ బేస్ వద్ద 3,500 మంది సైనికులను కూడా అమెరికా మోహరించింది. అవసరమైన సమయాల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి వీరిని నియమించినట్లు తెలుస్తున్నది. ఖతార్‌లో కూడా వేయి మంది సైనికులు ఉన్నారు. ప్రత్యేక వీసాలపై అమెరికాలో స్థిరపడాలనుకునే ఆఫ్ఘన్లకు వీరు సహాయం చేస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ పౌరులు, మిత్రులను బయటకు తీసుకురావడంపై మాత్రమే తమ దృష్టి ఉన్నదని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. ఇది తాత్కాలిక మిషన్ మాత్రమే అని ఆయన తెలిపారు.
ఇలాఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై చర్చించేందుకు జో బైడెన్.. జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అమెరికన్లు అక్కడి నుంచి వెంటనే బయలుదేరేందుకు సిద్ధం కావాలని యూఎస్ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అదనపు విమానాలను నడిపేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. తద్వారా తమ పౌరులతో కలిసి పనిచేసిన ఆఫ్ఘన్లను కూడా ప్రత్యేక వీసాలపై అమెరికాకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్‌లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి
నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు మోదీ తాతా..?!
హెలీకాప్టర్ తయారు చేశాడు.. రెక్క తగిలి చనిపోయాడు..
గ్యాస్ సబ్సిడీ అందట్లేదా..? ఇలా ప్రయత్నించండి!
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

