OMG 2 Trailer | ఉత్కంఠ రేకెత్తిస్తున్న అక్షయ్ కుమార్ ఓ మై గాడ్-2 ట్రైలర్
OMG 2 Trailer | అక్షయ్ కుమార్ హీరోగా తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్లో విడుదలైన చిత్రం ఓ మై గాడ్ (OMG) ఈ మూవీ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఓ మై గాడ్‌కు సీక్వెల్ (OMG 2) తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ (OMG 2 Trailer) విడుదల చేశారు.
OMG 2 Trailer | అక్షయ్ కుమార్ హీరోగా తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్లో విడుదలైన చిత్రం ఓ మై గాడ్ (OMG) ఈ మూవీ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉమేష్ శుక్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డుల అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రెండొందల కోట్లు కలెక్షన్లు సాధించింది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ గోపాల గోపాలగా రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఓమై గాడ్‌కు సీక్వెల్ (OMG 2) తెరకెక్కుతుంది. ఓ మై గాడ్-2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమిత్ రాయ్ (Amit Roy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ (OMG 2 Trailer) విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. తొలిపార్టులో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్ కుమార్.. ఓ మై గాడ్-2లో శివుడిగా కనిపించనున్నాడు. తొలిపార్టులో నాస్తికుడిగా పరేశ్ రావల్ కనిపిస్తే.. ఇందులో మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) గొప్ప భక్తుడిగా కనిపిస్తాడు. మూడు నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో పంకజ్ త్రిపాఠి తన సమస్యలను పరిష్కరించమని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక పరేశ్ రావల్ మొదటి పార్టులో తన షాప్ కోసం కోర్టులో దేవుడిపై కేసు వేసినట్లే.. ఓ మై గాడ్-2లో పంకజ్ కేసు దేవుడిపై ఉంటుంది. కాగా ట్రైలర్‌తోనే సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
తొలిపార్టుకు మించి ఈ సినిమా ఉండబోతుందని, పక్కా బ్లాక్ బస్టర్ అని ఇన్సైడ్ టాక్. వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో యామి గౌతమ్ లాయర్‌గా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

