గెలుపే లక్ష్యంగా..
- బెంగళూరుతో హైదరాబాద్ పోరు నేడు
- ఇండియన్ సూపర్ లీగ్
గోవా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్‌లో అత్యుత్తమ జట్లు అన్నదగ్గ వాటిలో ముందంజంలో ఉండే హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ), బెంగళూరు ఎఫ్‌సీ మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. బాంబోలిమ్ వేదికగా రెండు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరుగనుంది. లీగ్ దశ ఆఖరికి వస్తున్న వేళ ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు గెలుపు కోసం కడదాకా ప్రయత్నించే అవకాశముంది. వరుస మ్యాచ్‌ల్లో విజయాలతో కనిపించిన హెచ్‌ఎఫ్‌సీకి గత మ్యాచ్‌లో ఏటీకే మోహన్‌బగాన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. లీగ్‌లో దూకుడైన స్ట్రైకింగ్‌కు తోడు దుర్భేద్యమైన డిఫెన్స్ కల్గి ఉన్న హెచ్ఎఫ్సీ 1-2 తేడాతో మోహన్‌బగాన్ చేతిలో ఓటమి ఎదుర్కొంది. మరోవైపు గత ఐదు మ్యాచ్‌లో నాలుగు విజయాలతో ఓటమి ఎరుగని బెంగళూరు మంచి జోరు మీదుంది. పాయింట్ల విషయానికొస్తే 15 మ్యాచ్‌ల్లో 26 పాయింట్లతో హెచ్ఎఫ్సీ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుంటే..23 పాయింట్లతో బెంగళూరు మూడులో ఉంది. దీనికి తోడు బెంగళూరుతో జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో హైదరాబాద్ 1-0తో విజయాన్నందుకోవడం ఒకింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే అంశం. అయితే ఎలాగైనా ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న బ్లూస్.. హైదరాబాద్‌కు దీటైన పోటీనిచ్చేందుకు తహతహలాడుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Football
- HFC
- sports news
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

