వాషింగ్టన్: రోగనిరోధక శక్తిని కూడా ఒమిక్రాన్ అధిగమిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కరోనా సోకడం లేదా టీకా తీసుకోవడం వలన ఓ వ్యక్తి శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు డెల్టా లేదా ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్ల నుంచి ఏ మేరకు రక్షణ కల్పిస్తాయి, వాటి సమర్థత ఏమాత్రం ఉన్నది అనేది తెలుసుకునేందుకు కొత్త ర్యాపిడ్ పరీక్ష అందుబాటులోకి రానుంది. అమెరికా శాస్త్రవేత్తలు ‘కోవేరియంట్-స్కాన్’ అనే కొత్త ర్యాపిడ్ పరీక్షను అభివృద్ధి చేశారు.
‘బూస్టర్’పై నేడు చర్చించనున్న ఎన్టీఏజీఐ!
కొవిడ్ బూస్టర్ డోసుపై చర్చించేందుకు రోగనిరోధకతపై జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ)కి చెందిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూపు సోమవారం సమావేశం కానున్నది. బూస్టర్ డోసుతో పాటు చిన్నారులకు వ్యాక్సినేషన్‌పై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు ఆదివారం వెల్లడించాయి.