కర్ణాటకలో 87 కోట్ల స్కామ్!
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాజాగా రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్లో రూ.87 కోట్ల స్కామ్ వెలుగుచూసింది. కార్పొరేషన్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి.
- రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ ఖాతా నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు బదిలీ
- స్కామ్‌లో మంత్రి నాగేంద్ర హస్తం!
- కార్పొరేషన్ అకౌంట్స్ అధికారి ఆత్మహత్యతో తాజాగా వెలుగులోకి
- సూసైడ్ నోట్లో మంత్రి నాగేంద్ర సహా పలువురు కార్పొరేషన్ అధికారుల పేర్లు
- మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
బెంగళూరు/శివమొగ్గ, మే 29: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాజాగా రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్లో రూ.87 కోట్ల స్కామ్ వెలుగుచూసింది. కార్పొరేషన్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి. ఈ ఏడాది మార్చిలో అక్రమ మార్గంలో నిధులు ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తున్నది. ఈ కుంభకోణంలో ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి బీ నాగేంద్ర హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్టీ కార్పొరేషన్లో పనిచేసే అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొన్న నేపథ్యంలో ఈ స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ ఆత్మహత్య నోట్లో మంత్రి నాగేంద్రతో పాటు పలువురు కార్పొరేషన్ ఉన్నతాధికారుల పేర్లను ప్రస్తావించారు. తన చావుకు కార్పొరేషన్ ఎండీ జేజీ పద్మనాభం, అకౌంట్స్ ఆఫీసర్ పరుశురాం దురుగన్నవర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సుచిస్మిత రావల్ కారణమని చంద్రశేఖర్ తన సూసైడ్ నోట్లో రాశాడు.
సాఫ్ట్వేర్ కంపెనీల ఖాతాలకు సొమ్ము
ఎస్టీ కార్పొరేషన్‌కు స్థానిక ఎంజీ రోడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఖాతా ఉన్నది. దాని నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అదే బ్యాంకు ఇతర బ్రాంచ్‌లకు రూ.87 కోట్లు బదిలీ అయినట్టు సమాచారం. ఈ డబ్బు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల ఖాతాలకు వెళ్లినట్టు తెలుస్తున్నది. ఈ స్కామ్ ఆరోపణలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
నేను రాజీనామా చేయను: నాగేంద్ర
ఎస్టీ కార్పొరేషన్లో స్కామ్‌ను మంత్రి బీ నాగేంద్ర మంగళవారం ధ్రువీకరించారు. అయితే తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ఆయన నిరాకరించారు. తనకు ఈ స్కామ్‌లో ఎలాంటి పాత్ర లేదన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

