తెలంగాణలో కొత్తగా 710 కరోనా కేసులు
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 710 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,34,605కు

హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 710 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,34,605కు పెరిగింది. కొత్తగా 808 బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 6,20,757 మంది డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో నలుగురు బాధితులు వైరస్ బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,747కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,101 యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 97.81శాతానికి పెరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మరణాల రేటు 0.59శాతంగా ఉందని తెలిపింది. ఇవాళ ఒకే రోజు 1,10,355 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 80, జీహెచ్ఎంసీలో 71, వరంగల్ అర్బన్‌లో 51, మంచిర్యాలలో 47, పెద్దపల్లిలో 46, కరీంనగర్లో 34, భద్రాద్రి కొత్తగూడెంలో 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

