అమెరికాలో గజినీ… భార్యాబిడ్డలనే మరచిపోయాడు

మీరు వసంత కోకిల సినిమా చూశారా ! ఆ సినిమాలో శ్రీదేవి గతం మరిచిపోతుంది. పదహారేళ్ల వయసులో ఉన్న శ్రీదేవి ఏడేళ్ల వయసులోకి వెళ్లిపోతుంది.. చిన్న పిల్లలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. వయసు పైబడి లావుగా మారి బట్టతలతో ఉన్న తన తండ్రిని కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోతుంది..
2012లో వచ్చిన జబ్ తక్ హై జాన్ సినిమాలోనూ షారుఖ్ ఇలాగే గతం మరిచిపోతాడు. ఇండియన్ ఆర్మీలో తాను ఓ మేజర్ అనే విషయం కూడా షారుఖ్‌కు గుర్తుండదు. పదేండ్లు వెనక్కి వెళ్లిపోయి.. తానొక కాలేజి స్టూడెంట్ అనే అనుకుంటూ ఉంటాడు!! ఇక గజినీ సినిమాలో సూర్య కూడా సేమ్ ఇలాగే అన్నీ మరిచిపోతాడు ! ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా !! అమెరికాలో కూడా ఓ వ్యక్తి ఇలాగే తన గతం మరిచిపోయాడు.
అందమైన భార్య, ముద్దులొలికే కూతురు ఉన్న ఆ వ్యక్తి.. ఇంకా తనకు తాను స్కూల్ పిల్లాడినే అని అనుకుంటున్నాడు. అయితే సినిమాల్లో చూపించినట్టుగా యాక్సిడెంట్ జరగడం వల్లనో.. లేదా తలకు బలంగా దెబ్బతగలడం వల్లనో అతను అలా అయిపోలేదు. రోజూలాగే ఉదయం నిద్ర లేచిన అతను తన పాత జ్ఞాపకాలను కోల్పోయాడు. గతం మరిచిపోయి 20 ఏండ్లు వెనక్కి వెళ్లిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లోని గ్రాన్బరీకి చెందిన డేనియల్ ఒకరోజు నిద్రలేవగానే తాను ఉన్న బెడ్రూం చూసి షాకయ్యాడు. ఎక్కడ ఉన్నా అబ్బా అంటూ అద్దం ముందుకు వెళ్లిన అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. 16 ఏండ్లు ఉండే నేను ఎందుకు ఇలా పెద్దవాడిలా కనిపిస్తున్నాను.. లావుగా కనిపిస్తున్నానేంటని కంగారుపడి గట్టిగా అరిచాడు. ఇంతలో వచ్చిన ఒక మహిళను చూసి షాకైపోయాడు. ఆమె తనని కిడ్నాప్ చేసి ఉంటాడని భయపడిపోయాడు. ఉన్నట్టుండి తన భర్త డేనియల్ అలా వింతగా ప్రవర్తించడం చూసి ఆ మహిళ కంగారు పడిపోయింది. ఆమె తన భార్యనే అని చెప్పినా డేనియల్ వినిపించుకోలేదు. ఆమె చెప్పిన విషయాలు నమ్మలేదు. దీంతో తన భర్తకు ఏమైపోయిందోనని భయపడిపోయిన సదరు మహిళ రూత్.. డేనియల్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది.

అక్కడ డేనియల్ను పరిశీలించిన వైద్యులు.. షార్ట్ టర్మ్ మెమరీ సమస్య అయిన ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియాతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. 24 గంటల్లోనే మామూలు స్థితికి వచ్చేస్తాడని రూత్‌కు ధైర్యం చెప్పి పంపించారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి దాదాపు ఏడాదికి దగ్గరికి వస్తుంది. అయినా సరే తానెవరో ఇంకా డేనియల్‌కి గుర్తురావడం లేదు. 20 ఏండ్ల వెనకాలే ఉండిపోయాడు. దీంతో డేనియల్‌కు గతం గుర్తుచేసేందుకు అతని భార్య రూత్ ఎంతగానో ప్రయత్నిస్తుంది. పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తాయేమో అని 20 ఏండ్ల కిందట తన భర్త ఉన్న చోటు.. ఈ దంపతులు కలిసి తిరిగిన ప్రాంతాలను తిప్పిచూపించింది.. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో ఎప్పటికైనా తన భర్తకు జ్ఞాపకాలు గుర్తొస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తూ గడిపేస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- memory loss
- Texas
- Trending news
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

