ఆసరా పెన్షన్లకు రూ. 11 వేల కోట్లు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్లో ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 11,728 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సమైక్య రాష్ర్టంలో కేవలం రూ. 200 పెన్షన్ ఇస్తే.. తెలంగాణ రాష్ర్టంలో రూ. 2,016 పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు రూ. 2,106 చొప్పున, వికలాంగులకు రూ. 3,016 చొప్పున ప్రతీ నెల పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ర్టంలో 39 లక్షల 36 వేల 521 మందికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 2019-20లో కేంద్ర ప్రభుత్వం మనిషికి రూ. 200 చొప్పున 6 లక్షల 66 వేల మందికి గాను రూ. 105 కోట్ల సహాయం అందించిందన్నారు. వీరిందరికి ఒక్కొక్కరికి రూ. 1,816 కలిపి రాష్ర్ట ప్రభుత్వం రూ. 2,016 పెన్షన్ అందిస్తుందన్నారు. మిగతా 31 లక్షల 31 వేల 660 మంది అసహాయులకు నెలకు రూ. 2016 చొప్పున, వికలాంగులకు రూ. 3,016 చొప్పున పూర్తి భారాన్ని రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తూ ఆసరా పెన్షన్లను అందిస్తున్నదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

