YouTuber Fukra Insaan | రూ. 25 కోట్ల విలువైన ఇల్లు, జాగ్వర్ కారు : ఆ యూట్యూబర్ ఆస్తులు, రాబడి వివరాలివే..!
ఇంటర్నెట్ సెన్సేషన్ ఫుక్రా ఇన్సాన్‌గా (YouTuber Fukra Insaan) పేరొందిన అభిషేక్ మల్హన్ తన ఆదాయం, నికర సంపద వెల్లడించాడు. తనకు రూ. 25 కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
న్యూఢిల్లీ : ఇంటర్నెట్ సెన్సేషన్ ఫుక్రా ఇన్సాన్‌గా (YouTuber Fukra Insaan) పేరొందిన అభిషేక్ మల్హన్ తన ఆదాయం, నికర సంపద వెల్లడించాడు. తనకు రూ. 25 కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. బిగ్‌బాస్ ఓటీటీలో తనకు ఎలా అవకాశం వచ్చింది, తన భవిష్యత్ ప్రణాళికలనూ ఈ ఇంటర్వ్యూలో అభిషేక్ వివరించాడు. 1997లో జన్మించిన అభిషేక్ మల్హన్ గ్రేట్ ఖలీ, పునీత్ సూప్స్టార్ వంటి సెలబ్రిటీలతో కలిసి పనిచేయడంతో ప్రాచుర్యంలోకి వచ్చాడు.
మిస్టర్ బీస్ట్, కేఎస్ఐ వంటి క్రియేటర్ల స్ఫూర్తితో మల్హన్ యూట్యూబ్ ప్రస్ధానం ప్రారంభించాడు. యూట్యూబ్‌లో ఏకంగా 93 లక్షల మంది సబ్స్క్రైబర్లు కలిగిన మల్హన్ ఆదాయ వివరాలు తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. యూట్యూబ్‌పై నెలకు ఎంత సంపాదిస్తావని అడగ్గా ఈ విషయం తాను వెల్లడించదలుచుకోలేదని, ఈ వివరాలు చెబితే తన తండ్రి చంపేస్తాడని దాటవేశాడు.
ఇక నికర ఆస్తుల విలువను తాను ఎన్నడూ లెక్కించలేదని, ఓ ఇంటర్వ్యూలో ఆస్తుల విలువను వెల్లడించానని, ఇప్పుడు ఆ మొత్తం మూడు రెట్లు ఉంటుందని చెప్పాడు. తనకు జాగ్వర్ ఎఫ్-పేస్ కారు, రూ. 25 కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో మల్హన్ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2లో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు.
Read More :
Salaar Movie | దుమ్మురేపుతున్న ‘సీజ్ ఫైర్’.. సలార్ పార్ట్ 2కి మైండ్ బ్లోయింగ్ టైటిల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

