Salaar Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సలార్ – పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar Part 1 Cease Fire). ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అర్థరాత్రి నుంచి ప్రీమియర్స్, బెనిఫిట్ షోలతో థియేటర్లు మార్మోగిపోతున్నాయి. ఈ చిత్రం అంతటా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు. అయితే ఈ సినిమా ముగింపులో ప్రభాస్ అభిమానులకు ఒక సాలిడ్ అప్డేట్ను ఉంచాడు ప్రశాంత్ నీల్.
ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయిన అనంతరం.. ఎండ్ క్రెడిట్స్ వచ్చే ముందు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ను ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా మొదటి పార్ట్‌కు పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar Part 1 Cease Fire) అని టైటిల్ పెట్టిన ప్రశాంత్ ‘సలార్ పార్ట్ 2కు ‘శౌర్యాంగ పర్వం (Part 2- Shouryaanga Parvam) అని టైటిల్ ఫిక్స్ చేశాడు. ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవ, వరదలు బద్ద శత్రువులుగా ఎలా మారారో నీల్ ఇందులో చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమా 2024 డిసెంబర్లో రానున్నట్లు సమాచారం.