ఆ నేరస్థుడిని వీఐపీలా చూడాలా ? ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఇవాళ సుప్రీంకోర్టు నిరాకరించింది. మెడికల్ గ్రౌండ్స్‌పై మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సజ్జన్ కుమార్ ఆరోగ్య నిలకడగా ఉందని కోర్టు చెప్పింది. 75 ఏళ్ల మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ ఆరోగ్యం సరిగా లేదని, గుర్గావ్లో ఉన్న మెదాంత హాస్పిటల్లో ఆయనకు చికిత్స ఇప్పించాలని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఆ సమయంలో కోర్టు సీరియస్ అయ్యింది. చాలా హేయమైన నేరాల్లో ఆయన నిందితుడని, ఆయన్ను ఓ వీఐపీలా చూడాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలోని రాజ్‌నగర్‌లో జరిగిన ఓ హత్య కేసులో సజ్జన్ కుమార్ జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు. అత్యంత కిరాతంగా అయిదుగుర్ని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 2018 డిసెంబర్ నుంచి సజ్జన్ కుమార్ పది కిలోల బరువు తగ్గారని, ఆయన్ను తక్షణమే రిలీజ్ చేయాలని న్యాయవాది కోరారు. అయితే సజ్జన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ ఆరవ తేదీ లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

