Yana Mir: తాను మలాలా యూసఫ్ జాయ్‌ని కాదంటూ యునైటెడ్ కింగ్డమ్ (UK) పార్లమెంటులో ఆసక్తికర ప్రసంగం చేసిన జమ్ముకశ్మీర్ మహిళా జర్నలిస్ట్ యానా మిర్‌కు, ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ అధికారులకు మధ్య ఎక్స్ (X) వేదికగా సోషల్ మీడియా వార్ నడిచింది. ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనను అవమానించారని యానా మిర్ పోస్ట్ చేస్తే.. అందుకు ప్రతిగా చట్టానికి ఎవరూ అతీతులుకారంటూ కస్టమ్స్ అధికారులు మరో పోస్ట్ పెట్టారు.
జమ్ముకశ్మీర్‌కు చెందిన జర్నలిస్ట్ యానా మిర్ తనకు అందిన ఆహ్వానం మేరకు ఇటీవల లండన్‌కు వెళ్లి యూకే పార్లమెంట్లో ప్రసంగించి వచ్చారు. ‘నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని కాదు. ఎందుకంటే నేను భారత్‌లో క్షేమంగా, భద్రంగా ఉన్నాను’ అని యూకే పార్లమెంట్లో ఆసక్తికర ప్రసంగం చేశారు. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఆమె బ్యాగేజీని ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
దాంతో ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనను అవమానించారంటూ యానా మిర్ ఎక్స్ (X) లో ఒక వీడియోను షేర్ చేశారు. తనతో రూడ్‌గా బిహేవ్ చేశారని, అందరిముందు తన పర్సనల్ దుస్తులు, వస్తువులు ఉన్న బ్యాగేజీని ఓపెన్ చేసి చూశారని విమర్శించారు. లండన్‌లో తాను దేశం గురించి గొప్పగా చెబితే.. ఇక్కడ తనను దొంగలా చూశారని పేర్కొన్నారు. లండన్‌లో తనను భారతీయ మీడియా వారియర్‌గా చూస్తే.. ఢిల్లీ కస్టమ్స్ అధికారులు మాత్రం బ్రాండ్ స్మగ్లర్లా ట్రీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
What i said in London about India: I am FREE AND SAFE IN INDIA
How i was welcomed back to India 🤣🤐:
Madam scan your bag, open your bag, why you have louis vuitton shopping bags? Did you pay for them? Where are the bills???? 🤣
What Londeners think of me: INDIAN MEDIA WARRIOR… pic.twitter.com/ANIhhLoQJ3— Yana Mir (@MirYanaSY) February 26, 2024
అందుకు ప్రతిగా ఢిల్లీ కస్టమ్స్ అధికారులు కూడా సీసీటీవీ ఫుటేజీని ఎక్స్ (X) లో షేర్ చేశారు. లగేజీని చెక్ చేస్తామన్న తమ అభ్యర్థనను యానా మిర్ లెక్కచేయలేరని, తమకు సహకరించలేదని పేర్కొన్నారు. తన లగేజీనే చెక్ చేస్తారా అంటూ వాదనకు దిగారని తెలిపారు. అందుకు సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజీని పెట్టారు. చివరగా చట్టానికి ఎవరూ అతీతులుకారంటూ కస్టమ్స్ అధికారులు తమ పోస్టును ముగించారు.
Bag scanning of international passengers is done routinely. While other paxs put their luggage inside the scanner without any fuss
Ms. Yana Mir felt needlessly offended. Staff remained courteous throughout.Privileges are not above law. Footage tells the story. pic.twitter.com/vpwn4MMVQt— Delhi Customs (Airport & General) (@AirportGenCus) February 26, 2024