KK Survey | ఏపీలో నిజమయ్యాయి.. హర్యానాలో కేకే సర్వే అంచనాలు అట్టర్ ఫ్లాప్..!
KK Survey | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly elections) ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన కేకే (Kondeti Kiran) సర్వే (Survey).. హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly elections) ఫలితాలను అంచనా వేయడంలో మాత్రం పప్పులో కాలేసింది.
KK Survey : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly elections) ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన కేకే (Kondeti Kiran) సర్వే (Survey).. హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly elections) ఫలితాలను అంచనా వేయడంలో మాత్రం పప్పులో కాలేసింది. హర్యానాలో ఆ సర్వే అంచనాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఏపీ ఎన్నికలపై కేకే సర్వే కచ్చితమైన అంచనాలను వెల్లడించింది. ఆ సర్వే చెప్పినట్లుగానే ఏపీలో కూటమికి 160 సీట్లు వచ్చాయి. కేకే సర్వే అంచనాలు నిజం కావడంతో కూటమి నేతలు అప్పట్లో అతనిని ఘనంగా సన్మానించారు.
ఈ క్రమంలో హర్యానా ఎన్నికలపై కూడా కొండేటి కిరణ్‌కు చెందిన సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. హర్యానాలో 65కుపైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని కేకే సర్వే చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే హర్యానాలో కూడా కేకే చెప్పింది నిజమవుతుందని అంతా భావించారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వదని.. బీజేపీ టైటానిక్ షిప్లాంటిదని కేకే చెప్పారు. హర్యానాలో ప్రతి మూడు నియోజకవర్గాల్లో బీజేపీ రెండింట ఓడిపోతుందన్నారు.
అయితే ఫలితాలను బట్టిచూస్తే హర్యానాపై కేకే సర్వే అంచనాలు గాడి తప్పాయి. హర్యానా ప్రజల తీర్పును కేకే పసిగట్టలేకపోయారని తేలిపోయింది. ఆయన చెప్పిన దానికంటే విభిన్న ఫలితాలు ఆ రాష్ట్రంలో వచ్చాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి. అక్కడ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని అన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. కానీ రానురాను బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే 36 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. ఆరు స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ఇక్కడ ఆప్ ఖాతా కూడా తెరవలేకపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

