Woman’s Body Parts in Train | రైల్లో వదిలేసిన బ్యాగుల్లో.. రెండు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం
Woman's Body Parts in Train | రైలులో వదిలేసిన రెండు బ్యాగుల్లో రెండు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని క్లీనింగ్ సిబ్బంది గుర్తించారు. దీని గురించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
భోపాల్: రైలులో వదిలేసిన రెండు బ్యాగుల్లో రెండు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని క్లీనింగ్ సిబ్బంది గుర్తించారు. (Woman’s Body Parts in Train) దీని గురించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. అంబేద్కర్ నగర్-ఇండోర్ ప్యాసింజర్ రైలు శనివారం రాత్రి ఇండోర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులంతా దిగిన తర్వాత ఆ రైలును యార్డ్‌కు తరలించారు. అక్కడ క్లీనింగ్ సిబ్బంది రైలు బోగీలను శుభ్రం చేస్తుండగా వదిలేసిన ట్రాలీ బ్యాగ్, ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించాయి. వాటిని తెరిచి చూడగా రెండు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం వాటిల్లో ఉన్నాయి. కాళ్లు, చేతులు మాయమయ్యాయి.
కాగా, క్లీనింగ్ సిబ్బంది దీని గురించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెండు ముక్కలుగా నరికి రెండు బ్యాగుల్లో కుక్కిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల నుంచి నడుం వరకు ట్రాలీ బ్యాగులో, కింది భాగం ప్లాస్టిక్ బ్యాగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు చేతులు, రెండు కాళ్లు మిస్ అయ్యాయని చెప్పారు.
మరోవైపు 20-25 ఏళ్ల మధ్య వయసున్న మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి బ్యాగుల్లో కుక్కి రైలులో వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

