Viral Video | కారులో చికెన్ ఫ్రైడ్ కుక్ చేసిన మహిళ
ఓ మహిళ తన వాహనంలో ఫ్రైడ్ చికెన్‌ను కుక్ చేసిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాంలో సందడి చేస్తోంది.
Viral Video : ఇటీవల పలువురు వ్యక్తులు తమ కార్లలోనే పలు రకాల డిష్‌లను వండివార్చిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇక లేటెస్ట్గా ఓ మహిళ తన వాహనంలో ఫ్రైడ్ చికెన్‌ను కుక్ చేసిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాంలో సందడి చేస్తోంది. ఇన్స్టాగ్రాం రీల్లో వ్లాగర్ సోఫీ సల్దానా ముందుగా చికెన్ పీస్‌లను కట్ చేయడం కనిపిస్తుంది.
వీడియోపై లంచ్ బ్రేక్ బీ లైక్ అని టెక్ట్స్ రాసి ఉంది. ఇక ఈ వీడియోలో మహిళ ఫ్రైడ్ చికెన్‌ను వండటం చూడొచ్చు. పాట్లో ఆయిల్ పోసి చికెన్ పీస్‌లను డీప్ ఫ్రై చేయడం కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాంలో చక్కర్లు కొడుతోంది. ఈ రీల్‌కు ఇప్పటివరకూ ఏకంగా 55 లక్షల పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు.
మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత మీ కారు ఇన్సూరెన్స్ క్యాన్సిల్ కావచ్చని ఓ యూజర్ కామెంట్ చేయగా, నా కారులో నీకు అనుమతి లేదని మరో యూజర్ కామెంట్ చేశారు. నీ లంచ్ బ్రేక్ నాకంటే అధికమని మరో యూజర్ రాసుకొచ్చారు. కారులో ఇలా కుక్ చేయడం రిస్క్ అని మరొకరు కామెంట్ చేశారు. నాలుగు నెలల పాటు కారులో చికెన్ వాసన పోదని మరొకరు కామెంట్ చేశారు.
Read More :
Accident | పల్లె రవి కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

