Mamata Banerjee | అమిత్ షాకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మమతా బెనర్జీ
Mamata Banerjee | కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ పార్టీ హోదా కోల్పోవడంతో దానిని పునరుద్ధరించాలంటూ అమిత్ షాకు మమతా బెనర్జీ ఫోన్ చేశారంటూ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఆరోపించడంపై మండిపడ్డారు.
కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ పార్టీ హోదా కోల్పోవడంతో దానిని పునరుద్ధరించాలంటూ అమిత్ షాకు మమతా బెనర్జీ ఫోన్ చేశారంటూ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఆరోపించారు. దీంతో మమతా బెనర్జీ దీనిపై బుధవారం స్పందించారు. ‘ఇది తెలిసి నేను ఆశ్చర్యపోవడంతోపాటు షాక్ అయ్యాను. తృణమూల్ జాతీయ పార్టీ హోదా గురించి అమిత్ షాకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా’ అని అన్నారు. సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసివచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలపై కూడా మమతా బెనర్జీ మాట్లాడారు. ‘కొన్నిసార్లు మౌనం బంగారం. ప్రతిపక్షం కలిసి కూర్చోని మాట్లాడుకోదని అనుకోవద్దు. మేమంతా కలిసే ఉన్నాం. అందరూ ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు గాలివానలా జరుగుతుంది’ అని అన్నారు. అలాగే స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేయడంపైనా మమతా బెనర్జీ స్పందించారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున సున్నితమైన ఈ అంశంపై తాను మాట్లాడబోనని చెప్పారు. కోర్టు ఆదేశం తర్వాత మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

