రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలువాలి: ఆదిత్య ఠాక్రే

ముంబై: మీరు ప్రతిపక్షాలపై దృష్టి పెట్టబోతున్నట్లయితే, అది మనం చేయవలసిన పని కాదని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. రాజకీయాలను దాటి వెళ్లడమే మనందరి పని అని శివసేన నేతలు, కార్యకర్తలతోపాటు ప్రతిపక్షాలకు సూచించారు. అంతా కలిసి ప్రజల వెనుక నిలబడాల్సిన సమయం ఇది అని వ్యాఖ్యానించారు. వరదల సమయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే అడుగు బయటపెట్టలేదని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు విమర్శించడంపై ఆదిత్య ఠాక్రే ఈ మేరకు స్పందించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై దృష్టిపెట్టడం కాకుండా, ప్రజలకు సహాయ కార్యక్రమాలపై దృష్టిసారించాలని పార్టీ కేడర్‌కు సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలువాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వర్షాలకు బాగా ప్రభావితమైన కొంకణ్, పశ్చిమ ప్రాంతాలలో నివసించే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కాగా, మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో వంద మందికిపైగా మరణించగా సుమారు వంద మంది గల్లంతయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

