Kangana Ranaut : లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి, రెండో విడత లోక్‌సభ ఎన్నికల తేదీలు దగ్గరపడటంతో.. ఆ రెండు విడతలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల పద్ధతుల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆమె.. ఇవాళ జోగిందర్‌నగర్‌లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లతో కలిసి ఆమె స్టెప్పులేశారు. కంగనా రనౌత్ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Kangana Ranaut dances with people during a public meeting in Mandi’s Jogindernagar. pic.twitter.com/k3PODhNg9j
— ANI (@ANI) April 13, 2024