వీడియో: టీస్టాల్ వద్ద టీ గ్లాసులు, సాసర్లు కడుగుతున్న కోతి

న్యూఢిల్లీ: టీస్టాల్ వద్ద ఒక కోతి టీ గ్లాసులు, సాసర్లు కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఘంటా అనే ఇన్స్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాల్సిందే’ అని దీనికి శీర్షిక పెట్టారు. ఈ వీడియోలో తొలుత ఒక టీస్టాల్, కొంత మంది కస్టమర్లు కనిపిస్తారు. అనంతరం టేబుల్‌పై కూర్చొన్న ఒక కోతి టీ సాసర్ను కడుగుతుంది. అది శుభ్రమైందా లేదా అన్నట్లుగా దానిని వాసన చూస్తుంది. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్లో షారుఖ్ ఖాన్ బాలీవుడ్ మూవీ డైలాగ్స్ వినిపిస్తుంటాయి.
https://www.instagram.com/reel/CQxuHxCpy-y/?utm_source=ig_web_copy_link
కాగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. తల్లులు ఇకపై నీకంటే ఈ కోతి నయం అంటారని, ఈ నెల ఉత్తమ పనిమనిషి, రొట్టి కోసం ఇలా పని చేయక తప్పదు.. అంటూ పలు రకాలుగా కామెంట్ చేశారు. మరి కొందరు మాత్రం మూగజీవులను హింసిస్తున్నారని విమర్శించారు. ఆ కోతి మెడలో గొలుసు ఉండటాన్ని కొందరు గుర్తించారు. దానిని నిర్బంధించి పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

