Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి జీవితకాల శిక్ష
Mukhtar Ansari: 32 ఏళ్ల క్రితం నాటి మర్డర్ కేసులో ముక్తార్ అన్సారీకి జీవితకాల జైలు శిక్ష పడింది. వారణాసిలోని కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. అవదేశ్ రాయ్ మర్డర్ కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
వారణాసి: గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ(Mukhtar Ansari)కి జీవితకాల శిక్షను విధించారు. వారణాసిలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది. 32 ఏళ్ల క్రితం జరిగిన అవదేశ్ రాయ్ మర్డర్ కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ముక్తార్ అన్సారీ ఇప్పటికే జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవదేశ్ రాయ్‌ను 1991, ఆగస్టు 3వ తేదీన కాల్చి చంపారు. వారణాసిలోని అజయ్ రాయ్ ఇంటి ముందు ఈ ఘటన జరిగింది. ఆ ఘటనలో అన్సారీతో పాటు ఇతరులపై కేసు బుక్ చేశారు.
ఇదే కేసులో ముక్తార్ అన్సారీపై లక్ష జరిమానా వేశారు. అన్సారీపై 61 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతను దోషిగా తేలడం ఇది అయిదోసారి. అతనిపై మరో 20 కేసులు విచారణ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఏప్రిల్‌లోనే ఓ కిడ్నాప్-మర్డర్ కేసులో అతనికి పదేళ్ల జైలు శిక్ష పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

