న్యూఢిల్లీ : 2026 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్కు అందుబాటులో ఉన్న అన్ని ఉపాధి ఆధారిత రెండ ప్రాధాన్యత(డీబీ-2) వలస వీసాలు జారీ అయ్యాయని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఫలితంగా 2026 అక్టోబర్ 1న వార్షిక కోటా రీసెట్ అయి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే వరకు అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు భారతీయ దరఖాస్తుదారులకు మరిన్ని ఈబీ-2 గ్రీన్ కార్డులను జారీ చేయవు.
ఈబీ-2 అనేది ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ క్యాటగిరీ. సైన్స్, బిజినెస్ లేదా ఆర్ట్స్ వంటి రంగాల్లో ఉన్నత డిగ్రీలు ఉన్న నిపుణులు,అసాధారణ సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల కోసం ఉద్దేశించినది. ఈ క్యాటగిరీల్లో డిమాండ్ పెరుగుతున్నదని అమెరికా ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.భారత్ విషయంలో మరిన్ని రెట్రోగేషన్లు, క్యాటగిరీలను అందుబాటులోకి లేకుండా చేయడం అవసరమని అమెరికా భావిస్తున్నది.