‘యూపీఏ ప్రభుత్వం ప్రతి 4 నిమిషాలకు ఒక బిల్లు ఆమోదించింది’

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లులపై ఎలాంటి చర్చ జరుగకుండానే ఆమోదించారన్న ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. యూపీఏ ప్రభుత్వం ప్రతి నాలుగు నిమిషాలకు ఒక బిల్లును పార్లమెంట్లో ఆమోదించిందని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియా సమావేశంలో మండిపడ్డారు. 2004-14 వరకు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి చర్చ జరుపకుండానే 18 బిల్లులను వేగంగా ఆమోదించారని విమర్శించారు. 17 బిల్లులను 72 నిమిషాల్లో.. అంటే సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒక బిల్లును ఆమోదించారని మండిపడ్డారు.
‘2006 ఆగస్ట్ 7న లోక్సభలో కేవలం 14 నిమిషాల్లో ప్రభుత్వ సెక్యూరిటీల బిల్లును ఆమోదించారు. 2007లో నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లును నాలుగు నిమిషాలలో ఆమోదించారు. బ్యాంకింగ్ నియంత్రణ (సవరణ), నేషనల్ టాక్స్ ట్రిబ్యునల్ (సవరణ) బిల్లులు ఐదు నిమిషాలలో ఆమోదించారు. 2007 మార్చి 19న పన్ను చట్టాల (సవరణ) బిల్లును కేవలం రెండు నిమిషాల్లో క్లియర్ చేశారు’ అని కేంద్ర మంత్రులు వెల్లడించారు. ఈ వివరాలను సమావేశం అనంతరం మీడియాకు విడుదల చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

