అదనపు కట్నం కోసం గొడవ.. భార్య గొంతు నులిమి చంపిన భర్త
Dowry death: నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో నేరం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం గొడవపడి

ముజఫర్‌నగర్: నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో నేరం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం గొడవపడి భార్య గొంతు నులిమి చంపేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాకు చెందిన మోసిన, యాస్మిన్ మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.
జిల్లాలోని చౌసానా పట్టణంలో దంపతులిద్దరూ నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లు యాస్మిన్‌ను బాగానే చూసుకున్న మోసిన్ ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా కట్నం విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. మాటామాటా పెరుగడంతో ఆగ్రహించిన మోసిన భార్యను గొంతు నులిమి చంపేసి పారిపోయాడు. యాస్మిన్‌ను మోసిన్ ఎప్పుడూ కట్నం కోసం వేధించేవాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

