e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News TMC Protest: కేంద్ర హోంశాఖ కార్యాల‌యం ముందు టీఎంసీ ఆందోళ‌న‌

TMC Protest: కేంద్ర హోంశాఖ కార్యాల‌యం ముందు టీఎంసీ ఆందోళ‌న‌


న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాల‌యం ముందు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌కు దిగింది. త్రిపుర‌లో పోలీసుల దుర్మార్గాన్ని నిర‌సిస్తూ హోంమినిస్ట్రీ ముందు ఆందోళ‌న‌కు దిగిన‌ట్లు టీఎంసీ నేత‌లు తెలిపారు. త్రిపుర‌లో పోలీసుల అకృత్యాల‌పై మాట్లాడేందుకు త‌మ‌కు హోంమంత్రి అపాయింట్‌మెంట్ కావాల‌ని ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న‌ తృణ‌మూల్ నేత‌ల బృందం డిమాండ్ చేస్తున్న‌ది.

ఆందోళ‌న చేస్తున్న‌వారిలో డెరెక్ ఓబ్రియాన్‌, సుఖేందుకు శేఖ‌ర్ రాయ్‌, సంత‌ను సేన్‌, మాలా రాయ్ స‌హా మొత్తం 16 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నారు. అగ‌ర్తలా మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌తోపాటు మ‌రో 12 మున్సిప‌ల్ బాడీల‌కు ఈ నెల 25న పోలింగ్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో త్రిపుర‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో త్రిపుర పోలీసులు అధికార బీజేపీకి కొమ్ముకాస్తూ త‌మ పార్టీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని తృణ‌మూల్ ఆరోపిస్తున్న‌ది.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement