Tiger | రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన వాహనం.. గాయాలపాలై మృతి
Tiger | మహారాష్ట్ర గొండియా జిల్లాలోని నవేగావ్ - నగ్జీరా కారిడార్‌లో రోడ్డు దాటుతున్న పులిని వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్రంగా గాయపడ్డ పులి.. రోడ్డుపైనే ఉండిపోయింది. పులిని చూసిన వాహనదారులు తమ వాహనాలను దానికి కొంచెం దూరంలోనే ఆపేశారు. పులి చేతనై చేతకాక అన్నట్లు అడవిలోకి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ పులి ప్రాణాలు కోల్పోయింది.
Tiger | మహారాష్ట్ర గొండియా జిల్లాలోని నవేగావ్ – నగ్జీరా కారిడార్‌లో రోడ్డు దాటుతున్న పులిని వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్రంగా గాయపడ్డ పులి.. రోడ్డుపైనే ఉండిపోయింది. పులిని చూసిన వాహనదారులు తమ వాహనాలను దానికి కొంచెం దూరంలోనే ఆపేశారు. పులి చేతనై చేతకాక అన్నట్లు అడవిలోకి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ పులి ప్రాణాలు కోల్పోయింది.
అసలేం జరిగిందంటే..?
నవేగావ్ – నగ్జీరా కారిడార్‌లోని ముర్దోలి ఫారెస్టులో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఓ రెండేండ్ల వయసున్న పులి రోడ్డును దాటుతుండగా.. వేగంగా వచ్చిన వాహనం దాన్ని ఢీకొట్టింది. దీంతో పులికి తీవ్ర గాయాలయ్యాయి. లేవలేని పరిస్థితిలో, దీనంగా రోడ్డుపైనే పడిపోయింది పులి. ఆ తర్వాత కాసేపటికి అడవిలోకి వెళ్లిపోయింది.
గమనించిన వాహనదారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి డిప్యూటీ కన్జర్వేటర్ ప్రమోద్ పంచ్భాయి తమ బృందంతో అక్కడికి చేరుకున్నారు. పులి ఆచూకీ కోసం వెతికారు. ఘటనాస్థలానికి కొంచెం దూరంలో దీనంగా పడిఉన్న పులిని శుక్రవారం ఉదయం 7:30 గంటలకు గుర్తించారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన పులిని నాగ్‌పూర్ గోరెవాడలోని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్‌కు తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం దానికి పోస్టుమార్టం నిర్వహించారు. వన్యప్రాణులు సంచరించే అభయారణ్యాల గుండా వెళ్లే వాహనదారులు కాస్త నెమ్మదిగా ప్రయాణించాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

