మతస్వేచ్ఛలో మార్పిడి హక్కు లేదు
మతస్వేచ్ఛ అంటే అందులో ఒక ప్రత్యేక మతంలోకి మార్పిడి చేసే ప్రాథమిక హక్కు ఏదీ ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది
- బలవంతపు మతమార్పిడులు ఓ బెడదే.. వాటిని నిరోధించాలి
- కట్టడికి చట్టాలు అవసరం
- సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
న్యూఢిల్లీ, నవంబర్ 28: మతస్వేచ్ఛ అంటే అందులో ఒక ప్రత్యేక మతంలోకి మార్పిడి చేసే ప్రాథమిక హక్కు ఏదీ ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భయపెట్టడం, బెదిరించడం, కానుకలతో ప్రలోభపెట్టడం వంటి మోసకారి పద్ధతుల ద్వారా జరిగే మోసకారి మతమార్పిడులను నిరోధించాలని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కేంద్ర హోంశాఖ అఫిడవిట్ సమర్పించింది. దేశంలోని నిస్సహాయ వర్గాలకు చెందిన పౌరులను వ్యవస్థీకృతంగా, ఓ పద్ధతి ప్రకారం, తెలివైన రీతిలో జరిగే మోసకారి మతమార్పిడుల గురించి పిటిషనర్ అనేక ఉదంతాలను ఎత్తిచూపారని అఫిడవిట్లో పేర్కొన్నది.
రాజ్యాంగంలోని 14, 21, 25 అధికరణాలను మతమార్పిడులు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ చేసిన వాదనను ప్రస్తావిస్తూ 25వ అధికరణంపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగిందని హోంశాఖ గుర్తుచేసింది. మతప్రచారంలో మతమార్పిడి ప్రాథమిక హక్కు లేదనే స్పష్టీకరణ ఇచ్చిన తర్వాతనే రాజ్యాంగ సభ 25వ అధికరణాన్ని ఆమోదించిందని తెలిపింది.
మతప్రచారం అంటే మతంలోని సూత్రాల్లోగల సానుకూల అంశాలను నలుగురికీ తెలిసేలా చేయడంగా మాత్రమే చూడాలని అంటూ, మతమార్పిడి హక్కు అందులో భాగంగా లేదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. మోసపూరితంగా, బలవంతం చేసి మతమార్పిడి చేయడం అనేది వ్యక్తి అంతరాత్మ హక్కును భంగపరుస్తున్నదని, దీనిని నియంత్రించే అధికారం రాజ్యం పరిధిలోనే ఉన్నదని కూడా సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టు కేంద్ర హోంశాఖ తన అఫిడవిట్లో ఉదహరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

