యూజీసీ-నెట్ ఆన్సర్ కీ విడుదల
యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)కు సంబంధించిన ఆన్సర్ కీలను శుక్రవారం విడుదల చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 28: యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)కు సంబంధించిన ఆన్సర్ కీలను శుక్రవారం విడుదల చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. యూజీసీ-నెట్ 2026కు సంబంధించి 84 సబ్జెక్టుల తుది సమాధానాల కీలు అధికారికంగా విడుదలయ్యాయని ఎక్స్ వేదికగా ఎన్టీఏ పేర్కొంది. ప్రశ్నా పత్రాల ముద్రణ, అనువాద, భాష సంబంధిత లోపాలను ఒక నిపుణుల కమిటీ గుర్తించిన తర్వాత ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు హాజరైన విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఏజెన్సీ ఆదేశించింది.
పరీక్ష జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత ఆగస్టు 16న ఎన్టీఏ యూజీసీ-నెట్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అదే సమయంలో సోషియాలజీ, కా మర్స్, ఇంగ్లిష్ పేపర్లకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రకటనను కూడా జారీ చే సింది. ఆ తర్వాత అదే రోజున ఆయా పేపర్లలోని లోపాలను కారణంగా చూపుతూ, ఆ మూడు పరీక్షలను సెప్టెంబర్‌లో తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 9, 10 తేదీలలో రీ ఎగ్జామినేషన్ జరగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

