వీసీలను నియమించుకునే పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాలి : సీఎం స్టాలిన్
ఉపకులపతులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే కల్పించాలంటూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే ఈ సమయంలో బీజేపీ సభ నుంచి వాకౌంట్ చేసింది. విశ్వ విద్యాలయాల ఉపకులపతుల నియామకంలో గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రానికి సంక్రమించిన హక్కులను కాలరాస్తున్నారన్నది అధికార డీఎంకే పక్ష ఆరోపణ. మరోవైపు.. .అన్ని విశ్వ విద్యాలయాల వీసీలతో గవర్నర్ రవి ఊటి వేదికగా ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం రోజునే ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం గమనించదగ్గ పరిణామం.
విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం వల్ల ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం పడుతోందని స్టాలిన్ పేర్కొన్నారు. కొంత కాలంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ సలహాలు, సంప్రదింపులతో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఎంపిక జరుగుతోందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం గుజరాత్లో కూడా గవర్నర్ వీసీలను నియమించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
అయితే కొన్ని సంవత్సరాలుగా కొత్త ట్రెండ్ వచ్చిందని, ఉపకులపతుల నియామకాలు తమ హక్కులుగా గవర్నర్ భావిస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఇలా చేయడం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించడమే అవుతుందని స్టాలిన్ దుయ్యబట్టారు.గవర్నర్ ఇలా వ్యవహరించడం వల్ల అధికార యంత్రాంగంలో తీవ్ర గందరగోళం నెలకొందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..నిన్న ఒక్కరోజే 83,670 మంది దర్శనం
Ram Gopal Varma | ‘రామాయణం 2’ కలెక్షన్లు పార్ట్1 కంటే పదింతలు ఎక్కువ ఉంటాయి: రామ్ గోపాల్ వర్మ
IND vs NZ | నిలకడగా ఆడుతున్న కివీస్.. 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..!
Health tips | విటమిన్ B12 లోపాన్ని లైట్ తీసుకుంటున్నారా.. గుండెకు, లివర్‌కు ప్రమాదమట తెలుసా..?
KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

