Parliament: గాంధీ విగ్రహం ముందు ఎంపీల నిరసన.. ఉభయసభలు 2 గంటలకు వాయిదా
Parliament: సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.ఆ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యం డౌన్‌డౌన్ అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. సైలెంట్ ప్రొటెస్ట్ టీషర్ట్ ను డెరిక్ ఒబ్రెయిన్ వేసుకున్నారు.
న్యూఢిల్లీ: స్మోక్ అటాక్ ఘటనను ఖండిస్తూ పార్లమెంట్(Parliament)లో ఆందోళన చేపట్టిన 14 మంది ఎంపీలను గురువారం సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్‌కు గురైన ఆ ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. సస్పెండ్ అయినవారిలో 13 మంది లోక్‌సభలో, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యం డౌన్‌డౌన్ అన్న ప్లకార్డులు పట్టుకున్నారు. సైలెంట్ ప్రొటెస్ట్ టీషర్ట్ ను డెరిక్ ఒబ్రెయిన్ వేసుకున్నారు.
మరో వైపు ఇవాళ ఉభయసభలు వాయిదాపడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభంకాగానే.. విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో రెండు సభలను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఆదేశాలనే ప్రభుత్వం పాటిస్తోందని పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. స్మోక్ ఘటన అంశం ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు.
పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపడుతున్న సస్పెండ్ అయిన ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ కలిశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

