పొరుగు దేశాల్లో ఏం జరుగుతున్నదో చూడండి!.. సుప్రీం వ్యాఖ్యలు
బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపునకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
- గవర్నర్ల అధికారం కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపునకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వారం నేపాల్‌లో, గత ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక నిరసనల గురించి కోర్టు ప్రస్తావించింది. ‘మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతున్నదో ఓ సారి చూడండి’ అంటూ వ్యాఖ్యానించింది. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్లు నెలకు పైగా తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోవడాన్ని కేంద్రప్రభుత్వ తరపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించిన క్రమంలో సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
మన రాజ్యాంగాన్ని చూస్తే గర్వంగా ఉంది..
‘ఒకసారి మన చుట్టూ ఉన్న దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి.. నేపాల్‌లో పరిస్థితులను ఒకసారి చూడండి. ఈ పరిస్థితుల్లో మన రాజ్యాంగాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది’ అని చీఫ్ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. దీనిని అంగీకరించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ‘నిజమే. బంగ్లాదేశ్‌లో కూడా గత ఏడాది ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. విద్యార్థులు నిర్వహించిన నిరసన ఉద్యమం ప్రభుత్వం భవనాల స్వాధీనంతో పాటు వాటి ధ్వంసానికి దారితీశాయి. వారు ప్రధాని అధికారిక నివాసాన్ని కూడా నాశనం చేశారు’ అని పేర్కొన్నారు. కాగా, 90 శాతం బిల్లులు నిర్దేశిత గడువులోగానే గవర్నర్ ఆమోదం పొందుతున్నాయని తుషార్ మెహతా పేర్కొన్నారు. 1970-2025 మధ్య కేవలం 20 బిల్లులను మాత్రమే గవర్నర్ పెండింగ్‌లో ఉంచారని ఆయన చెప్పారు. అయితే ఈ గణాంకాలను తాము పరిగణనలోకి తీసుకోలేమని, రాష్ట్రం కోణంలో ఇది ఎంతమాత్రం సబబు కాదని సీజేఐ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

