నిర్ణీత సమయంలోగా తేల్చాలి!
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలిపే అధికారాలను నియంత్రించే ఆర్టికల్ 200లో ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదం లేకపోయినా గవర్నర్లు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు మంగళవారం పేర్కొంది.
- గవర్నర్లు బిల్లులకు ఆమోదం తెలపడంపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలిపే అధికారాలను నియంత్రించే ఆర్టికల్ 200లో ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదం లేకపోయినా గవర్నర్లు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు మంగళవారం పేర్కొంది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్ సమ్మతించడానికి, రాష్ట్రపతికి నివేదించడానికి కోర్టు నిర్దేశిత కాలపరిమితి విధించవచ్చా? అన్న అంశంపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు 8వ రోజు విచారణ కొనసాగింది.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సంబంధించి గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 200 వివరించిందని, దాని ప్రకారం గవర్నర్లు బిల్లుకు ఆమోదం తెలపాలి, లేదా ఆమోదాన్ని నిలువరించాలి, పునః పరిశీలన కోసం, లేదా నిలిపివేత కోసం రాష్ట్రపతికి పంపాలని కోర్టు తెలిపింది. గవర్నర్ నిర్ణీత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించిన వాదనలను సెప్టెంబర్ 10న ముగించాలని ధర్మాసనం నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

