బాణసంచాకు, మతానికి సంబంధం ఏమిటి?
మతానికి, బాణసంచా కాల్చడానికి సంబంధం ఏమిటని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో పండగ సీజన్లో వాయు కాలుష్యం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేసిన ధర్మాసనం, మత పరమైన నమ్మకాలను, పర్యావరణ ఆందోళనను పరిగణనలోనికి తీసుకొని సమతుల్య దృష్టితో కేసును విచారిస్తామని పేర్కొన్నది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ మాట్లాడుతూ ఏటా టపాసులు కాల్చే సంప్రదాయం పెరుగుతూనే ఉందన్నారు.
- ప్రజల్లో అవగాహన ముఖ్యం
- ఢిల్లీలో పండగ కాలుష్యంపై సుప్రీం
న్యూఢిల్లీ: మతానికి, బాణసంచా కాల్చడానికి సంబంధం ఏమిటని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో పండగ సీజన్లో వాయు కాలుష్యం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేసిన ధర్మాసనం, మత పరమైన నమ్మకాలను, పర్యావరణ ఆందోళనను పరిగణనలోనికి తీసుకొని సమతుల్య దృష్టితో కేసును విచారిస్తామని పేర్కొన్నది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ మాట్లాడుతూ ఏటా టపాసులు కాల్చే సంప్రదాయం పెరుగుతూనే ఉందన్నారు.
‘తమ పేరు మీద కాల్చే బాణసంచా వల్ల పిల్లలు సతమతమవుతూ అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిస్తే దేవుళ్లు దిగ్భ్రాంతి చెందుతారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ ‘మతాచారాలను మేం గాయపరచం. ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైన పద్ధతి. వాళ్లకు ఆ అవగాహన పెరిగేలా మీరు చర్యలు తీసుకోవచ్చు’ అని అవగాహన పెంచాల్సిన అవసరాన్ని, ఉత్సవాలను బాధ్యతగా జరుపుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దీనికి అర్పితా సింగ్ బదులిస్తూ దురదృష్టవశాత్తు ఏటా ఇదే వాదనలు పునరావృతం అవుతున్నాయని..అమల్లో మాత్రం చాలా తక్కువ పురోగతి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.
హానికరమైన బాణసంచా అమ్మకాలపై నియంత్రణ విధించడాన్ని, నిర్దిష్ట విభాగాలకు చెందిన బాణసంచా మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసే అంశాన్ని పరిశీలించాలని కోర్టు ప్రతిపాదించింది. నిర్దిష్ట సమయంలో బాణసంచా కాల్చడాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వారిలో అవగాహన పెంచే కర పత్రాలను ప్రచురించాలని సూచించింది. దీనిపై అర్పితా స్పందిస్తూ నిబంధనల అమల్లో లోపాలను ఎత్తి చూపుతూ వాటి అమలు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. వాయు నాణ్యత నిర్వహణ అథారిటీకి ఈ సూచనలను పంపాలని కోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

