ఆ ప్రశ్నకు సరైన సమాధానం తేల్చండి
నీట్ యూజీ-2024లో అడిగిన ఓ ప్రశ్నకు సరైన సమాధానాన్ని తేల్చాలని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ను కోరింది. ఇందు కోసం ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని, సరైన సమాధానంపై మంగళవారం మధ్యాహ్నంలోగా నివేదిక ఇవ్వాలని సూచించింది.
- నీట్లో వివాదాస్పద ప్రశ్నపై ఢిల్లీ ఐఐటీని కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూలై 22: నీట్ యూజీ-2024లో అడిగిన ఓ ప్రశ్నకు సరైన సమాధానాన్ని తేల్చాలని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ను కోరింది. ఇందు కోసం ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని, సరైన సమాధానంపై మంగళవారం మధ్యాహ్నంలోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. నీట్ యూజీ పరీక్షలో ‘అణువు’ దాని లక్షణాలకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, ఆ రెండింటిలో ఒక నిర్దిష్ట సమాధానం ఇచ్చిన వాళ్లకే నాలుగు మార్కులు ఇచ్చారంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
ఇది తుది మెరిట్ జాబితాపై తీవ్ర ప్రభావం చూపిందని సీజేఐ ధర్మాసనానికి తెలిపారు. అంతకుముందు నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాగత వైఫల్యం జరిగిందనే దానికి, దేశవ్యాప్తంగా విస్తృతంగా పేపర్ లీకేజీ అయిందనే దానికి తగిన డాటా చూపించాలని పిటిషన్‌దారులకు సూచించింది. విస్తృతంగా లీకేజీ అయిందన్న దానికి ఆధారాలు లేవని, కేవలం పాట్నా, హజారీబాగ్ వంటి చోట్ల మాత్రమే అక్రమాలు జరిగాయని తెలిపింది.
ఎన్టీఏ ఏర్పడ్డ తర్వాత 16 పరీక్షలు వాయిదా
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాటైన నాటి (2018లో) నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 16 పరీక్షలు వాయిదా పడ్డాయని, ఆ సంస్థ 240 పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించిందని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. కొవిడ్-19 సంక్షోభం, సాంకేతిక, పాలనాపరమైన సమస్యలు, పరీక్ష పేపర్ రవాణాలో ఆటంకాలు తదితర కారణాలతో పరీక్షలు వాయిదా పడ్డాయని కేంద్ర సహాయమంత్రి సుకాంత మజుందార్ సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

