Cyclone Biparjoy | మరింత తీవ్రంగా బిపర్జోయ్ తుఫాను.. అల్లకల్లోలంగా అరేబియా సముద్రం.. వీడియో
Cyclone Biparjoy | ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపొర్జాయ్ తుఫాను మరింత తీవ్రమైంది. ఈ తుఫాను ప్రభావం భారతదేశపు పశ్చిమతీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌పై ఎక్కువగా ఉన్నది.
వల్సాద్: ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను మరింత తీవ్రమైంది. ఈ తుఫాను ప్రభావం భారతదేశపు పశ్చిమతీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌పై ఎక్కువగా ఉన్నది. దాంతో మహారాష్ట్ర, గుజరాత్ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం మీదుగా తీరంవైపు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దాంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
ఇక దాయాది దేశం పాకిస్థాన్‌లో అయితే ఈ బిపర్జోయ్ తుఫాను బీభత్సం సృస్టిస్తున్నది. ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను ఉత్తరదిశగా ప్రయాణిస్తూ పాకిస్థాన్ తీరాన్ని తాకింది. ఈ తుఫాను ప్రభావంతో పాకిస్థాన్‌లోని పలు తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అక్కడ ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నది. తుఫాను ధాటికి పాకిస్థాన్‌లో ఇప్పటికే 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తున్నది.
అయితే, మన దేశంపై ఈ తుఫాను ప్రభావం అంతగా లేనప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా ఉంది. అందుకే మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కాగా, తుఫాను ధాటికి గుజరాత్ తీర పట్టణమైన వల్సాద్‌లో తితాల్ బీచ్ దగ్గర అలలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Valsad, Gujarat: Strong winds & high tide hits Gujarat coast as cyclone Biporjoy intensifies. Visuals from Tithal Beach. pic.twitter.com/w3xIofUDmA
— ANI (@ANI) June 12, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

