disqualified Congress MLAs | అనర్హత వేటు పడిన ఆరుగురు హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక
disqualified Congress MLAs | అనర్హత వేటు పడిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
న్యూఢిల్లీ: అనర్హత వేటు పడిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (disqualified Congress MLAs) బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలైన సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, రవి ఠాకూర్, చెతన్య శర్మ, రాజిందర్ రాణా, దేవిందర్ కుమార్ భుట్టో పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించారు. రాజసభ్య ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఓటు వేశారు. దీంతో ఫిబ్రవరి 29న అసెంబ్లీ స్పీకర్ ఈ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆరు అసెంబ్లీ స్థానాలకు లోక్‌సభ ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. అయితే అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఉప ఎన్నికల అంశంపై కోర్టు నిర్ణయం తీసుకోనున్నది.
కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఆశిష్ శర్మ (హమీర్పూర్ నియోజకవర్గం), హోషియార్ సింగ్ (డెహ్రా), కెఎల్ ఠాకూర్ (నాలాగర్) శుక్రవారం తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శి యశ్ పాల్ శర్మకు రాజీనామా సమర్పించారు. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ఈ ముగ్గురు కూడా శనివారం బీజేపీలో చేరారు.
#WATCH | Six rebel MLAs of Himachal Pradesh- Sudhir Sharma, Ravi Thakur, Inder Dutt Lakhanpal, Devendra Bhutto, Rajendra Rana, and Chaitanya Sharma, join BJP in the presence of Himachal Pradesh BJP President Rajiv Bindal and Union Minister Anurag Thakur. pic.twitter.com/IftAl6U1T5
— ANI (@ANI) March 23, 2024
#WATCH | Three independent MLAs from Himachal Pradesh- Ashish Sharma, KL Thakur, and Hoshiyar Singh join the BJP in the presence of Himachal Pradesh BJP President Rajiv Bindal and Union Minister Anurag Thakur. pic.twitter.com/SvyZMLHDyw
— ANI (@ANI) March 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

