మేమూ స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారు చేస్తాం.. డీసీజీఐని కోరిన సీరం!

పుణె: రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను తాము కూడా తయారుచేస్తామంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారీ కాంట్రాక్ట్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దగ్గర ఉంది. ఇప్పటికే రష్యా నుంచి దిగుమతి అయిన వ్యాక్సిన్లను కూడా రెడ్డీస్ ల్యాబ్స్.. అపోలో హాస్పిటల్స్‌కు సరఫరా చేస్తోంది.
అయితే ఈ వ్యాక్సిన్‌ను తాము కూడా తయారు చేస్తామని బుధవారం డీసీజీఐకి సీరం దరఖాస్తు చేసుకున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఈ సంస్థ ఇప్పటికే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్ పేరుతో తయారు చేస్తోంది. ఇదే కాకుండా అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ వ్యాక్సిన్లనూ తయారు చేయనుంది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు గత ఏప్రిల్ నెలలోనే డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

