సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలకు నో : సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలు చేపట్టరాదని, వారి సమ్మతితోనే ఆ వృత్తి కొనసాగుతుంటే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. వ్యభిచారం అనేది వృత్తి అని, చట్ట ప్రకారం సెక్స్ వర్కర్లు గౌరవంతో జీవించేలా వారికి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్ల హక్కులను పరిరక్షించేందుకు ఆరు కీలక ఆదేశాలను జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జారీ చేసింది.
న్యూఢిల్లీ : సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలు చేపట్టరాదని, వారి సమ్మతితోనే ఆ వృత్తి కొనసాగుతుంటే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. వ్యభిచారం అనేది వృత్తి అని, చట్ట ప్రకారం సెక్స్ వర్కర్లు గౌరవంతో జీవించేలా వారికి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్ల హక్కులను పరిరక్షించేందుకు ఆరు కీలక ఆదేశాలను జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జారీ చేసింది.
సెక్స్ వర్కర్ వయోజనురాలై ఆమె సమ్మతితో వృత్తిని కొనసాగిస్తుంటే పోలీసులు జోక్యం చేసుకోరాదని, ఆయా సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలకు దూరంగా ఉండాలని కీలక ఉత్తర్వులు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవంతో జీవించే హక్కు ఉందని బెంచ్ స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయరాదని, శిక్షించడం, వేధించడం చేయరాదని పేర్కొంది.
స్వచ్ఛందంగా వృత్తిలో పాల్గొనడం చట్టవిరుద్ధం కానందున వ్యభిచార గృహాలపై దాడుల్లో వారిని బాధితులుగా చూడరాదని తెలిపింది. సెక్స్ వృత్తిలో ఉన్నదనే ఏకైక కారణంతో సెక్స్ వర్కర్ పిల్లలను తల్లి నుంచి వేరుచేయరాదని ఆదేశించింది. కనీస భద్రత, గౌరవంగా జీవించే హక్కు సెక్స్ వర్కర్లు, వారి సంతానానికి వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. సెక్స్ వర్కర్లపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో ఆయా కేసుల్లో సెక్స్ వర్కర్ల పట్ల వివక్ష చూపరాదని పోలీసులను ఆదేశించింది. సెక్స్ వర్కర్లపై లైంగిక వేధింపులు జరిగితే వారికి తక్షణమే వైద్య, న్యాయపరమైన సాయం అందించాలని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

