Home
National
Rutuja Latke The Candidate Of Uddhav Thackeray Faction Of Shiv Sena Continues Her Lead On Andheri East
అంధేరి ఈస్ట్‌లో నోటాపై 20 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో రుతుజా లట్కే
Andheri East :
ముంబై: మహారాష్ట్రలో అంధేరి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఆరు రౌండ్లు ముగిసేసరికి ఉద్ధవ్‌థాకరే వర్గం శివసేన అభ్యర్థి రుతుజా లట్కేకు 24,995 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 4,712 ఓట్లతో నోటా రెండో స్థానంలో ఉన్నది. అంటే నోటాపై రుతుజా లట్కే 20,283 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
అంధేరి ఈస్ట్ ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణంతో ఉద్ధవ్ థాకరే ఆ స్థానంలో ఆయన సతీమణి రుతుజాను బరిలో దించారు. ముందుగా ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మజీతియా బరిలో నిలిచారు. ఆయనకు ఏక్నాథ్ షిండే వర్గం శివసేన మద్దతు ప్రకటించింది. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీ తన అభ్యర్థి నుంచి పోటీ నుంచి ఉపసంహరించుకుంది. దాంతో అక్కడ రుతుజా లట్కేకు నోటాకు మధ్య మాత్రమే ప్రధాన పోటీ నెలకొంది. మిగతా అభ్యర్థులెవరికీ ఇప్పటివరకు 1000 ఓట్లు కూడా రాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

