Watch: రద్దీ మార్కెట్ వద్ద ప్రమాదకరంగా కారు, బైక్‌తో స్టంట్.. తర్వాత ఏం జరిగిందంటే?
risky car stunt | జనంతో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద కొందరు వ్యక్తులు కారు, బైక్‌తో స్టంట్ (risky car stunt) చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
లక్నో: జనంతో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద కొందరు వ్యక్తులు కారు, బైక్‌తో స్టంట్ (risky car stunt) చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి ఆల్ఫా 2 ప్రధాన మార్కెట్ వద్ద కొందరు వ్యక్తులు కారు, బైక్‌తో విన్యాసాలు చేశారు. అక్కడి రోడ్డుపై వాహనాలతో రౌండ్లు కొట్టి స్టంట్లు చేశారు. ఇది చూసి అక్కడున్న వ్యాపారులు, జనం ఆందోళన చెందారు.
కాగా, ఒక వ్యక్తి మొబైల్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. వాహనాలతో ప్రమాదకరంగా నిత్యం స్టంట్లు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ అధికారులకు ట్యాగ్ చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.
#ग्रेटरनोएडा हुड़दंग मचाने वालों का आतंक अल्फा2 की मार्केट में बिना नंबर प्लेट स्विफ्ट सवार हुड़दंगी बीच बाजार में स्विफ्ट गाड़ी को बीचो-बीच स्टंट करते हुए नजर आए, आए दिन मोटरसाइकिल,कार सवार करते हैं दबंगई #बीटा2 थाना क्षेत्र का मामला @DCPGreaterNoida @CP_Noida @Uppolice pic.twitter.com/lls2p2ZazX
— Wasim Pathan (@WasimPathan99) December 22, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

