ఎల్జేపీ ఎంపీపై రేప్ కేసు.. ఎఫ్ఐఆర్లో చిరాగ్ పాశ్వాన్ పేరు

న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్‌పై ఢిల్లీలో రేప్ కేసు నమోదైంది. ఆయనతోపాటు మాజీ కేంద్రమంత్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం గమనార్హం. మూడు నెలల కిందట బాధితురాలు ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ పోలీస్ స్టేషన్లో ప్రిన్స్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 9న ప్రిన్స్ రాజ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను రేప్ చేయడంతోపాటు తన అశ్లీల వీడియోను వైరల్ చేస్తానని కూడా ప్రిన్స్ రాజ్ బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని కూడా ఆయన బెదిరించినట్లు చెప్పింది. ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ చిరాగ్‌కు సోదరుడి వరస అవుతారు. ఈ విషయాన్ని చిరాగ్ పాశ్వాన్‌కు చెప్పినా పట్టించుకోలేదని, ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని అన్నారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో చిరాగ్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. బాధితురాలు గతంలో లోక్ జనశక్తి పార్టీ కార్యకర్తగా చేసినట్లు తెలిపింది. తనకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదంటూ బాధితురాలిపై అదే పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

