పెగాసస్ ప్రకంపనలు.. ఉభయసభలు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు ఇవాళ విపక్ష నినాదాలతో హోరెత్తాయి. పెగాసస్ స్పైవేర్‌పై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకువచ్చారు. ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశించారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ బిర్లా.. విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన రీతిలో నోటీసు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఆ అంశంపై సోమవారమే ప్రకటన చేసిందన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. అన్ని అంశాలపై సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ తెలిపారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే సీన్ రిపీటైంది. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకురావడంతో.. సభను చైర్మన్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. పెగాసస్ లాంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను ఎప్పుడైనా కాంగ్రెస్ వాడిందా.. ఇలాంటి గూఢచర్యం గురించి తమకు తెలియదన్నారు. న్యూ ఇండియా మేకింగ్‌కు ఇదో స్ట్రాటజీ అని అధిర్ ఆరోపించారు.
ప్రభుత్వానికి, పెగాసస్ ఇష్యూకు సంబంధం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకవేళ ఆ సమస్యను వాళ్లు లేవనెత్తాలనుకుంటే, దాన్ని సరైన రీతిలో ప్రశ్నించాలన్నారు. ఇప్పటికే ఆ అంశంపై మంత్రి సమాధానం ఇచ్చినట్లు జోషీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

