Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
Rajnath Singh | యుద్ధాల తీరు మారుతున్నదని, ఈ నేపథ్యంలో ఏ రూపంలోనైనా ముప్పు పొంచి ఉండవచ్చని రక్షణమంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు, ఆకస్మిక దాడులు నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సైన్యానికి పిలుపునిచ్చారు. ఢిల్లీ (Delhi) లో నిర్వహించిన వైమానిక దళ కమాండర్ల సమావేశంలో (IAF Commanders Meet) ఆయన మాట్లాడారు.
Rajnath Singh : యుద్ధాల తీరు మారుతున్నదని, ఈ నేపథ్యంలో ఏ రూపంలోనైనా ముప్పు పొంచి ఉండవచ్చని రక్షణమంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు, ఆకస్మిక దాడులు నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సైన్యానికి పిలుపునిచ్చారు. ఢిల్లీ (Delhi) లో నిర్వహించిన వైమానిక దళ కమాండర్ల సమావేశంలో (IAF Commanders Meet) ఆయన మాట్లాడారు. రక్షణ, ప్రతిదాడుల విషయంలో అధునాతన పద్ధతులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలను నిరంతరం పెంచుకోవాలని, ముప్పును ముందే పసిగట్టి నష్టం సంభవించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని రాజ్‌నాథ్ దిశానిర్దేశం చేశారు. శత్రువులు కోలుకోవడానికి సమయం ఇవ్వని సామర్థ్యాలను మన రక్షణ దళాలు పెంపొందించుకోవాలని, శత్రువులు ఉన్నపళంగా దాడి చేసినా వారి వ్యూహంలో చిక్కుకోకుండా ముందే అప్రమత్తమయ్యేలా బలంగా మారాలని సూచించారు. మన చర్యలు వారి ఊహకందని విధంగా ఉండాలన్నారు.
గూఢచార, నిఘా యంత్రాంగాలను మరింత బలోపేతం చేసుకోవాలని, ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు ప్రతిక్షణం సిద్ధంగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల గురించి ఆయన ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో రైఫిళ్ల కంటే డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ఆత్మాహుతి డ్రోన్లు, నిఘా డ్రోన్ల వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
సైబర్ యుద్ధాలు, అంతరిక్షంలోనే ఆయుధాలను మోహరించి శత్రువులపై దాడి చేయడం లాంటి అత్యాధునిక యుద్ధ రీతుల కోసం ప్రత్యేక విధానాలను అభివృద్ధి చేయాలని వైమానిక దళానికి పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
‘గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం’
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డుకు చిత్రియాల సర్పంచ్ ఎంపిక
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 44 మందికి ఉద్యోగాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

