నేటి నుంచి రైల్వే కౌంటర్ టికెట్లకూ బీమా
ఇకపై ఆఫ్‌లైన్‌లో రైల్వే కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు కూడా ప్రయాణ బీమా పథకం సదుపాయం అందుబాటులోకి రానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలవుతున్న ఈ పథకం అక్టోబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.
న్యూఢిల్లీ : ఇకపై ఆఫ్‌లైన్‌లో రైల్వే కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు కూడా ప్రయాణ బీమా పథకం సదుపాయం అందుబాటులోకి రానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలవుతున్న ఈ పథకం అక్టోబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం ప్రయాణికుడు టికెట్‌పై కేవలం 45 పైసలు చెల్లిస్తే చాలు.. రూ. 10 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. అయితే దీనిని ప్రయాణికుల ఎంపికకే వదిలివేశారు.
ఈ ప్రీమియం తీసుకునే వారు కచ్చితంగా తమ మొబైల్ నంబరును రిజస్టర్ చేయించుకోవాలి. టికెట్ చార్జీతో కలిపి దీనిని వసూలు చేస్తారు. ఈ బీమా పథకంలో భాగంగా రైలు ప్రమాదం లేదా ఏదైనా ఇతర అవాంఛనీయ ఘటనల కారణంగా ప్రయాణికుడు మరణించినా, లేదా తీవ్రంగా గాయపడి, శాశ్వత అంగవైకల్యానికి గురైనా గరిష్ఠంగా రూ.10 లక్షల బీమా అందిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

